CM రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల దంపతులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-30 06:41:44.0  )
CM రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల దంపతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఇవాళ ఆయన నివాసంలో కలిసి నాగార్జున, అమల అభినందనలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. రేవంత్ రెడ్డితో కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రేవంత్ రెడ్డిని కలిసి సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేందుకు సినీ పెద్దలు వేచి చూస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story