- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్: ముత్తినేని
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయ సంకల్ప యాత్ర-2 పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. వివక్ష లేకుండా జీవన భద్రత కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యా, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు భరోసా కల్పించేందుకు విజయసంకల్ప యాత్ర -2ను బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు అండగా ఉండాలని అభ్యర్థించనున్నట్లు పేర్కొన్నారు.