ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలవాలి: T-టీడీపీ అధ్యక్షుడు కాసాని

by Satheesh |
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలవాలి: T-టీడీపీ అధ్యక్షుడు కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీకి మొద‌టి నుంచీ ఖ‌మ్మం జిల్లా కంచుకోట‌ అని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటాల‌ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. విభేదాలు వీడి పార్టీ నాయ‌కులంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలను గెల్చుకోవాల‌ని సూచించారు. హైదరాబాద్‌లో సోమ‌వారం ఖ‌మ్మం జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పాల్వంచ రామారావు, ప్రధాన కార్యద‌ర్శి టీవీ రాజు, బీసీ జేఏసీ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌, సీపీఎంకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిప‌ల్ డాక్టర్ బీవీ రాఘ‌వులు, బీఆర్‌ఎస్ నాయ‌కులు చ‌ల్ల రామ‌కృష్ణ, నాగేంద్ర చారి, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ అధ్యక్షుడు ప‌సుపులేటి వెంక‌టేశ్వర్ల ఆధ్వర్యంలో 100 మంది టీడీపీలో చేరారు. వారికి కాసాని టీడీపీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయ‌కులంతా ల‌క్ష్యసాధ‌న దిశ‌గా ముందుకు సాగాల‌న్నారు. తెలంగాణ‌లో అధికార పార్టీల ప్రజావ్యతిరేక చ‌ర్యల‌ను ప్రజ‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున టీడీపీ పాల‌న రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఎన్టీఆర్‌, చంద్రబాబు పాలనలో చేప‌ట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల‌పై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజ‌ల ఆశీర్వాదం పొందాల‌ని నేతలను ఆదేశించారు. బీఆర్ఎస్‌, బీజేపీ పాల‌న ప‌ట్ల ప్రజానీకం ఏ మాత్రం సంతోంగా లేర‌ని.. ప్రభుత్వాల నిరంకుశ చ‌ర్యల‌ను ఎండ‌గ‌డుతూ గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయాల‌ని సూచించారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్సవాల నేప‌థ్యంలో పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక స‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కూరపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేట‌ర్ బియ్యని సురేష్‌, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రట‌రీ క‌నగాల సాంభ‌శివ‌రావు, పార్లమెంటు కార్యద‌ర్శి తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కాప కృష్ణ మోహ‌న్‌, ఖ‌మ్మం న‌గ‌ర కో-ఆర్డినేట‌ర్ విజయ్‌, పార్టీ నాయ‌కులు కేతినేని హ‌రీష్‌, చెన్నయ్య, చెరుకూరి చ‌ల‌ప‌తి రావు, మండేపూడి నాగేశ్వర్‌రావు, కొండ‌బాల క‌రుణాక‌ర్‌, వ‌డ్లమూడి వెంక‌టేశ్వర్‌రావు, రామ‌కోటేశ్‌శ్వర్‌రావు, చేతుల నాగేశ్వర్‌రావు, కూచిపూడి వెంక‌టేశ్వర్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story