- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో BJP గెలవబోయే MP సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన అమిత్ షా
దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆదివారం బుధవారం కాగజ్ నగర్‌లో భారీ బహిరంగా నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు కావని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటిని దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వమని అన్నారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇక, దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిందని, మోడీ ఇప్పటికే సెంచరీ కొట్టారని చెప్పారు. మూడో దశ వచ్చే సరికి 200 సీట్లు దాటుతాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలింగ్ సమయానికి బీజేపీకి 250 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. గతంలో కంటే ఈ సారి తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని.. రాష్ట్రంలో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. ఓ వైపు మోడీ.. మరోవైపు రాహుల్ ఉన్నారు. మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నారు. కానీ సెలవులు వచ్చాయంటే రాహుల్ గాంధీ బ్యాంకాక్‌లో ఎంజాయ్ చేస్తారని విమర్శించారు. ప్రజా సేవ చేసే మోడీ కావాలా.. ఎంజాయ్ చేసే రాహుల్ బాబా కావాలా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల పాటు రామమందిరం నిర్మాణంలో కాంగ్రెస్ కాలయాపన చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక చొరవ తీసుకుని అయోధ్యలో రామ మందిరం నిర్మించామని తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రాహుల్, ఖర్గే, సోనియా గాంధీలను ఆహ్వానించినా రాలేదన్నారు.
Read More...
ఫేక్ వీడియో ఇష్యూ.. కాంగ్రెస్ పార్టీపై ఫుల్ సీరియస్ అయిన కేంద్రమంత్రి అమిత్ షా
- Tags
- amit shah