కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి కోలుకోలేని దెబ్బ (ఆడియో)!

by GSrikanth |   ( Updated:2022-10-21 09:04:29.0  )
కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి కోలుకోలేని దెబ్బ (ఆడియో)!
X

దిశ, వెబ్‌డెస్క్: సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో ప్రచారం చేయలేక ఆస్ట్రేలియాకు పయనమైన ఎంపీ వెంకట్ రెడ్డి భాగోతం బట్టబయలు అయినట్లు తెలుస్తోంది. ఆయన ఆస్ట్రేలియా పర్యటన వెనుక అసలు నిజం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటెయ్యాలంటూ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు ఫోన్లో చెబుతున్నట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కాంగ్రెస్‌లో చిచ్చురేపింది. ఆ ఆడియోలో మునుగోడు కాంగ్రెస్‌ నేతలకు వెంకట్ రెడ్డి ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని చెబుతుండటం సంచలనానికి తెరలేపింది. ''ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొస్తా. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా. చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి పేదలకు సాయం చేసే వ్యక్తి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఓటేయండి'' అంటూ వెంకట్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేగాక, ఉప ఎన్నికకు ముందే వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కావడం పట్ల కాంగ్రెస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Advertisement

Next Story