బ్రేకింగ్: MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్ట్

by Satheesh |   ( Updated:2023-02-13 08:32:16.0  )
బ్రేకింగ్: MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తాజా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టక పోవటాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ - విజయవాడ హై దిగ్భందానికి ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టని బీజేపీకి మాదిగల ఓటు అడిగే నైతిక హక్కు లేదని మందకృష్ణ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అరెస్ట్ చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను విడుదల చేయాలని ఆయన తెలంగాణ, ఏపీ సీఎంలు, డీజీపీలను మందకృష్ణ కోరారు.

Advertisement

Next Story