దానంకు ఎంపీ టికెటా.. మంత్రి పదవా? డైలమాలో బొంతు భవితవ్యం!

by Ramesh N |
దానంకు ఎంపీ టికెటా.. మంత్రి పదవా? డైలమాలో బొంతు భవితవ్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ కీలక నేతలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారాా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో బొంతు రామ్మోహన్ భవితవ్యం అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకమాండ్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారా? లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒక వేళ పార్టీ హైకమాండ్ బొంతు ఫ్యామిలీకి టికెట్ అంగీకరిస్తే.. దానంకు మంత్రి పదవి ఇచ్చి బొంతు ఫ్యామిలీ నుంచి సికింద్రాబాద్ టికెట్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని గెలిపించే బాధ్యతను దానంకు అప్పగించనున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డికి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి పోటీ చేస్తారనే చర్చ జరిగింది.

ఈ నెల 19 అభ్యర్థుల లిస్ట్?

ఇటీవల కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌లో తెలంగాణలో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మిగతా ఎంపీ అభ్యర్థుల కోసం పార్టీ కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌లో మిగితా 13 నియోజనక వర్గల ఎంపీ అభ్యర్థులను డిసైడ్ చేయనున్నారు. ఈ నెల 19 అభ్యర్థులను అఫిషియల్‌గా ప్రకటించనున్నారని సమాచారం. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎంపీ టికెట్ల విషయం ఓ కొలిక్కి రానుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్ ఇస్తారా? లేక ప్రభుత్వంలో మంత్రి పదవి? అనేది హైకమాండ్‌పై ఆధారపడి ఉంది.

Advertisement

Next Story