కాసేపట్లో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం.. సీఎం కేసీఆర్‌పై ఎంపీ సంతోష్ ప్రశంసలు

by Mahesh |
కాసేపట్లో కొత్త సెక్రటేరియట్ ప్రారంభం.. సీఎం కేసీఆర్‌పై ఎంపీ సంతోష్ ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం మరికాసేపట్లో ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం కేసీఆర్ మీదుగా ఈ సచివాలయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకలు వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆనందానికి హద్దుల్లేవు. ఈ సచివాలయం నిర్మాణానికి కారమైన సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సైతం ట్వీట్ చేశారు. ఈ సచివాలయం భారతదేశంలోనే మొట్టమొదటదని, అధ్భుతమైనదని హర్షం వ్యక్తం చేశారు. ఈ సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ అసమానమైన దార్శనికుడని ప్రశంసించారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలకు అంకితం కాబోతుందన్నారు. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదని, ప్రజల జీవితాలను మెరుగుపర్చుతుందని చెప్పారు. కోట్ల మంది తెలంగాణ ప్రజల కలలు నిజమయ్యే ప్రదేశమే ఈ కొత్త సచివాలయమని జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story