గవర్నర్.. కేసీఆర్‌ను కాపాడే పనిలో పడ్డారు: రేవంత్

by GSrikanth |   ( Updated:2023-02-04 11:58:10.0  )
గవర్నర్.. కేసీఆర్‌ను కాపాడే పనిలో పడ్డారు: రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ విషయంలో తీవ్ర ఆరోపణలు, ఆగ్రహాలు వ్యక్తం చేసిన గవర్నర్‌ సడన్‌గా ప్లేట్ మార్చి కేసీఆర్‌ను కాపాడే పనిలో పడ్డారని సెటైర్ వేశారు. గవర్నర్ స్పీచ్‌తో బీఆర్ఎస్‌, బీజేపీ మధ్య ఉన్న అలయ్-బలయ్ బయటపడిందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని తాను ఎప్పటినుంచో చెబుతున్నట్లు గుర్తుచేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story