- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోండి.. ఎంపీ రఘునందన్ రావు
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సర్పంచులకు పెండింగ్ ఉన్న బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెంటనే స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల మంజూరు కోరుతూ మాజీ సర్పంచులు (Pending bills of sarpanches) చేపట్టిన చలో సెక్రటేరియట్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులపై రఘునందన్ రావు స్పందించారు. పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయడం దారుణం అన్నారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని. గత ప్రభుత్వం కారణంగా సర్పంచులంతా ఉపాధి కూలీలుగా, ముంబయికి వెలసబాట పట్టారని విమర్శించారు. పెండింగ్ బిల్లలను విడుదల చేయాలని కోరుతూ చలో సెక్రటేరియట్ పిలుపునిస్తే వారిని అరెస్టు చేయడం దారుణం అని, సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని వారం రోజుల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.