- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 ఏండ్లలో ఏం చేశావ్..? కేసీఆర్‌పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
దిశ, తెలంగా బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం 'నిరసన దీక్ష'ను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వంపై వారు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు భారీ స్పందన వస్తోందని, అందుకే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంటోందని విమర్శించారు. 8 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్, రుణ మాఫీ, ఉచిత యూరియా, మూడేళ్లుగా నిరుద్యోగ భృతి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చే ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్య సేకరణలో కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైరయ్యారు. రూ.35 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను లక్ష కోట్లకు చేర్చి రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి సంజయ్‌ను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఒకటి రెండ్రోజులు యాత్రను అడ్డుకోవచ్చని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగిస్తామని, కేసీఆర్ చెర నుంచి వీడిపిస్తామన్నారు. ఈనెల 27వ తేదీన పాదయాత్ర ముగింపు సభ నిర్వహించి తీరుతామన్నారు. గురువారం నుంచి యాత్ర యథావిధిగా కొనసాగుతుందని లక్ష్మణ్ తెలిపారు.