కేసీఆర్‌పై షర్మిల విమర్శలు.. నోరు అదుపులో పెట్టుకో అంటూ కవిత కౌంటర్

by GSrikanth |   ( Updated:2023-02-08 15:58:03.0  )
కేసీఆర్‌పై షర్మిల విమర్శలు.. నోరు అదుపులో పెట్టుకో అంటూ కవిత కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయంలో అగ్నిప్రమాదంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల రియాక్ట్ అయ్యారు. ప్రారంభానికి సిద్ధం అవుతున్న సచివాలయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌పై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె అగ్ని ప్రమాదంపై అఖిలపక్షం నేతల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.11 వందలు కోట్ల వ్యయంతో కట్టిన సచివాలయంలో సరైన భద్రత ప్రమాణాలు లేవని ఈ ఘటనతో బయటపడిందని ఆరోపించారు. దొర ఏది కట్టినా పైన పటారం లోన లొటారం అన్నట్టుగానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ ఘటన విషయంలో మాక్ డ్రిల్ చేశామంటూ పచ్చి అబద్ధాలు చెబితే నమ్మేవారు ఎవరూ లేరని, ఇకనైనా ప్రమాదానికి సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టాలని అన్నారు.

షర్మిలకు కవిత కౌంటర్:

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను తిడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర కాకపోతే మోకాళ్ళ యాత్ర చేసుకోవాలి అంతే కాని సీఎంపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇకనైనా గాలిమాటలు మాట్లాడకుండా బుద్ధి మార్చుకోవాలి హితవు పలికారు. ఒక వేళ షర్మిల పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే ఆమెను తరిమికొడతారని అన్నారు. కాగా ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి ముందు షర్మిల గురువారం సీఎం కేసీఆర్ తనతో పాటు ప్రజల మధ్య నడవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కేసీఆర్‌కు బూట్లను పంపుతున్నట్లు చెప్పారు. దీనిపై మాలోత్ కవిత స్పందిస్తూ ఈ మేరకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed