Eatala : తృప్తిగా పనిచేస్తా.. పదవిపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
Eatala : తృప్తిగా పనిచేస్తా.. పదవిపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాకు ఏ హోదా ఉన్నా, ఏ పదవి ఉన్నా తృప్తిగా పనిచేస్తానని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం కంటోన్మెంట్ బంజారానగర్‌లో జరిగిన సీనియర్ సిటిజన్స్, బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయానికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా కొట్లాడడమే నా వ్యక్తిత్వం అని తెలిపారు. తృప్తి, గౌరవం లేనిది ఎంత పెద్ద పదవి అయినా వ్యర్థమని నేను భావిస్తాను.. అని వెల్లడించారు. ఆయన మా బిడ్డ అని ఇంటింటికీ భావించి నాకు ఓటువేసి గెలిపించారని తెలిపారు. చెరువులు, మూసీ ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ బాగుపడాలని ఆ నీళ్లు నల్లగొండ రైతులకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాని అన్నారు.

కానీ ఇల్లు కూలగొట్టి రాత్రికి రాత్రి బిచ్చగాళ్ళుగా చేసే పనిని వ్యతిరేకించానని చెప్పారు. పేదల పక్షాన కొట్లాడుతున్నానని, పేదవారి గొంతుక అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ప్రతిరోజు నేను ప్రజల మధ్యనే ఉంటాను.. పిలిస్తే పలికే వ్యక్తిని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎక్కడ ఆపద ఉన్న మీ కుటుంబ సభ్యుడిగా అందుబాటులో ఉంటానని ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story