Chhaava: రోమాలు నిక్కబొడిచేలా ‘చావా’ సన్నివేశాలు.. సినిమా వీక్షించిన ఎంపీ ఈటల

by Ramesh N |
Chhaava: రోమాలు నిక్కబొడిచేలా ‘చావా’ సన్నివేశాలు.. సినిమా వీక్షించిన ఎంపీ ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘చావా’ (Chhaava) సినిమాలో సన్నివేశాలు ప్రతి భారతీయ పౌరుడు రోమాలను నిక్కబొడిచేలా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) అన్నారు. ఇవాళ కొంపల్లిలోని తీయేటర్‌లో ‘చావా’సినిమాను ఎంపీ ఈటల రాజేందర్ తన అనుచరులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 ఏళ్ల క్రితం భారతమాతను చెరపట్టాలని పరాయి పాలకులైన మొగల్ చక్రవర్తులు దేశం మీద దాడి చేశాడని తెలిపారు. మన స్త్రీలను చెడగొట్టినాడు, దేవాలయాలు కొల్లగొట్టిన నాడు.. మన ఆనవాళ్లు లేకుండా కుట్రపన్నిన నాడు శివాజీ మహారాజ్ మన ధర్మాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడడం కోసం వీరోచితంగా పోరాటం చేశారు.. అని వివరించారు. ఆయన లొంగిపోకపోతే అనేక రకాల హింసలు పెట్టారని అన్నారు.

ఆయన ఆశయాలను భుజాన వేసుకున్న శివాజీ కుమారుడు శంభాజీ భరతమాతను కాపాడని ప్రయత్నం చేశారని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చావా సినిమా.. మొగల్ చక్రవర్తులు మన మీద చేసిన దాడులు, మన సంస్కృతిని ధ్వంసం చేసిన తీరు, మన భరతమాత ముద్దుబిడ్డలను చిత్రహింసలు పెట్టినతీరు ఎంత భయంకరంగా జుగుప్సాకరంగా ఉందో సినిమాలో ప్రతిబింబించాయని వెల్లడించారు. ఆ మహనీయులు ఏ స్ఫూర్తిని ఇచ్చారో, ఏ బాధ్యతను ఇచ్చారో వాటిని గుండెల్లో పదిలంగా పెట్టుకుని.. రాబోయే కాలంలో భరతజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి.. అని తెలిపారు. ప్రపంచ చిత్ర పటం మీద మన జాతి గౌరవ పతాక ఎగురవేయడంలో ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నం సమున్నతంగా పెరగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చావా సినిమా తీసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story