- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను ఎప్పుడూ అనలే’.. కవిత అరెస్ట్‌పై MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. కవితపై ఈడీ, సీబీఐ పెట్టిన కేసులకు బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ వాటి పని అవి చేసుకుపోతాయన్నారు.
సుప్రీంకోర్టులో కవిత కేసు వాయిదాలకు బీజేపీ ఎలా బాధ్యత వహిస్తోందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి దర్యా్ప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలను తాము ఏ సందర్భంలోనూ వాడుకోలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించి పార్టీలో చేర్చుకుని కేసులు మాఫీ చేస్తారనడం సరికాదన్నారు. కవిత అరెస్ట్‌పై తమ పార్టీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయనను సమాధానం అడగాలన్నారు.