- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దోపిడీ మాత్రమే తెలిసిన గాడిదలకు గాడిద గుడ్డే కనిపిస్తుంది: బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది ఏమీ లేదని.. వారు రాష్ట్రానికి ఇచ్చింది కేవలం గాడిద గుడ్డు మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు వ్యాఖ్యలకు వివరణగా.. బండి తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.
60 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన హైవేలకు సమానంగా 10 ఏళ్లలోనే నిర్మిస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. గిరిజనుల ప్రగతికి సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తే... అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. రైతుల ఎరువు కష్టాలు తీర్చేలా రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపిస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. పన్నుల వాటా 32% నుంచి 41%కు పెంచి తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు ఇస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. రాష్ట్రానికి పథకాలు, అభివృద్ధి పనుల కోసం రూ.5 లక్షల కోట్లు ఇస్తే .. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. తెలంగాణ ప్రగతికి దాదాపు రూ.10 లక్షల కోట్ల రుణ సాయం అందిస్తే.... అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ 32,823 కోట్లు ఖర్చు చేస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాలకు రూ.34 వేల కోట్లకు పైగా ఇస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. వ్యవసాయం అనుబంధ రంగాల కోసం రూ. 40,559 కోట్లు ఖర్చు చేస్తే... అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. ఎరువులు, రసాయనాల మీద సబ్సిడీల రూపంలో రూ.39,649 కోట్లు ఖర్చు చేస్తే... అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని నిజంగా కోరుకునేవారికి ఇది బంగారు గుడ్లు... దోపిడీ మాత్రమే తెలిసిన గాడిదల కళ్లకు మాత్రం ఇవి గాడిద గుడ్లు
Read More...