- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారంతా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ ఇష్యూపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టుపై కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. మేడిగడ్డ దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలని అన్నారు. ఎన్నికలు రాగానే.. బీఆర్ఎస్, బీజేపీ ఒకనే అని ప్రతిసారి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన వారిని అడ్డుకునేందకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని.. అవి కూడా ఫలించక కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే లీకులు కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలివైన వారు.. రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వారు ఎవరూ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోరు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ కాదు.. ఆల్రేడీ మునిగిన నావ అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు.