- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలి: అసదుద్దీన్‌కు MP బండి సంజయ్ సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: నలుగురు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కొందరు కలెక్టర్లు కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్‌లో అన్ని పనులను కలెక్టర్లే చక్కదిద్దుతున్నారన్నారు. అలాంటి కలెక్టర్ల వల్ల తెలంగాణకు చెడ్డపేరు వస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం నేతలు తెలంలగాణలో 55 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారని, వారికి దమ్ముంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీకి.. బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఉమ్మడి పది జిల్లాల్లో 10 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సెంటిమెంట్‌ను అడ్డుపెట్టు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. అలాంటిది బీజేపీ గురించి మాట్లాడే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదని విరుచుపడ్డారు. బీజేపీ గురించి ఆయనకేం తెలుసని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణకు, కేసీఆర్‌కు మధ్య పేగు బంధం తెగిపోయిందని ఆయన వెల్లడించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా.. పక్క రాష్ట్రాలకు వెళ్ళే అర్హత కేసీఆర్‌కు లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రకు అప్పగించిన నీచ చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని విరుచుకుపడ్డారు.
ఏడాది కాలంగా 15 భారీ బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించిన రికార్డు బీజేపీ సొంతమని పేర్కొన్నారు. తెలంగాణపై అగ్రనేతలు మోడీ, అమిత్ షా పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. రామరాజ్య స్థాపన కోసమే బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వీధి సభల్లో మోడీ విజయాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. 80 శాతం హిందువులు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారబోతున్నారని బండి వ్యాఖ్యానించారు. బీజేపీ.. ఇస్లాంకు వ్యతిరేకం కాదని, హిందువులను కించపరిస్తే మాత్రం సహించేది లేదని వెల్లడించారు.
తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలన్న చర్చ ప్రజల్లో జోరుగా నడుస్తోందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని, ఆ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనేది ప్రజలకు సైతం అర్థమైందన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ హోల్ సేల్‌గా బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయిందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌తో బీజేపీ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కార్యకర్తల త్యాగలపై ఏర్పడిన పార్టీ బీజేపీ అని నేతల్లో జోష్ నింపారు. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదని ఘాటు విమర్శలు చేశారు.
నవీన్ మిట్టల్ కు రూ.6 కోట్ల ముడుపులందాయి.. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి
పార్లమెంటులో చర్చకు భయమెందుకు..?అదానీ కుట్రలు బట్టబయలు కావాల్సిందే