- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్ కీ బార్ జైల్ సర్కారే.. కేసీఆర్‌పై MP అర్వింద్ తీవ్ర విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటోందని, కానీ అది నిజం కాదని, వారిది అబ్ కీ బార్ జైల్ సర్కార్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలపై ఐఎండీ అధికారులు ముందస్తు సమాచారం ఇస్తారని, సోయి ఉన్న ప్రభుత్వమైతే ముందస్తు చర్యలు చేపట్టేదని ఆయన చురకలంటించారు. తన పార్లమెంట్ పరిధిలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. ఫసల్ బీమాకు సంబంధం లేకుండా ఎకరానికి రూ.50 వేల నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఎకరానికి రూ.32 వేలు, మహారాష్ట్రలో ఎకరాకు రూ.9 నుంచి 12 వేలు పంట నష్టపరిహారంగా అక్కడి బీజేపీ ప్రభుత్వాలుఅందిస్తున్నాయని, కేసీఆర్ ఎందుక అందిచట్లేదని మండిపడ్డారు.
రాష్ట్రం మొత్తం మునిగిపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఫాం హౌజ్‌కు పరిమితమయ్యారని, ముఖ్యమంత్రి దారిలో మంత్రులు వెళ్తున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం కంటే పెద్ద ఫాంహౌజ్ ఉందని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే క్యాప్షన్ పెట్టుకునే అర్హత లేదని విమర్శించారు. పంట నష్టంపై గవర్నర్ కలుగజేసుకొని రిపోర్ట్ తెప్పించుకొని రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సీడ్ బౌల్‌గా తెలంగాణను చేస్తానన్నారని, కానీ ఏపీ సీడ్ బౌల్ గా అవుతోందని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినట్లు బొందలగడ్డ పేరును వైకుంఠధామంగా మార్చారు తప్పితే కేసీఆర్ కొత్తగా చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మహారాష్ట్రలో పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.