- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM KCRకు ఎంపీ అర్వింద్ సంచలన సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్‌కు దమ్ముంటే నిజామాబాద్‌లో పోటీ చేయాలని అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. నిన్న నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఢిల్లీలో స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్‌లో కేటీఆర్ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చారని మండిపడ్డారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని గృహలక్ష్మి పథకం విషయంలో ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోందన్నారు. ఈ స్కీమ్‌కు రూ.12 వేల కోట్లు ఇచ్చామని 2022-23 బడ్జెట్ స్పీచ్ లో ప్రభుత్వం అబద్దం చెప్పిందని ఆరోపించారు.
బడ్జెట్ పత్రాలను కేటీఆర్ కంటే తానే ఎక్కువ చదివానని ఈ బడ్జెట్‌లో రూపాయి గృహలక్ష్మి పథకానికి ఉంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు తాను సిద్ధమేనని ఎప్పుడు రమ్మంటే అప్పుడు కేటీఆర్ ఇంటికి వెళ్లి నిరూపిస్తానన్నారు. గహలక్ష్మి పథకం దరఖాస్తులకు మూడు రోజుల గడువు ఇచ్చి మద్యం టెండర్లకు మాత్రం 15 రోజుల గడవు ఇచ్చారని ధ్వజమెత్తారు. కవితను ప్రజలు ఎప్పుడో ఇంటికి పంపించారని కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
రాష్ట్రంలో లక్షల రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రేషన్ కార్డులు ఇవ్వకుండానే గృహలక్ష్మి అప్లికేషన్లకు రేషన్ కార్డులు చూపించాలని అడుగుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ దగ్గర సంస్కారం నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. ఎంపీకి మొఖం లేక రాలేదని విమర్శలు కాదని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విప్ ఉందన్నారు. 2009లో మహాకూటమి తరపున బరిలో నిలిచిన కేటీఆర్ 171 ఓట్లతో గెలిచారని 75 వేల మెజార్టీ ఓట్లతో గెలిస్తే దాన్ని అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నారని సెటైర్ వేశారు.