వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ చలాన్ చెల్లింపునకు మరికొద్ది గంటలే సమయం

by Shiva |   ( Updated:2024-01-09 16:49:11.0  )
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ చలాన్ చెల్లింపునకు మరికొద్ది గంటలే సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ చలాన్లను చెల్లింపునకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో కార్యక్రమానికి భారీ స్పందన వస్తుంది. అయితే, పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపునకు గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. దీంతో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. తాజాగా, ప్రభుత్వం డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సదావకాశం ఇంకా ఒక్కరోజు అంటే రేపు అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే ఉంది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. చలానాల చెల్లింపులో ఎమైనా సందేహాలు ఉంటే 040-27852721 కాల్, 8712661690 (వాట్సప్‌) నంబర్లకు మెసేజ్ పంపాలని అధికారులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌ ద్వారా ట్రాఫిక్‌ చలానాలు చెల్లించవచ్చు.

Advertisement

Next Story