గొర్రెల పంపిణీ పథకంలో మనీలాండరింగ్! రంగంలోకి ఈడీ..

by Ramesh N |
గొర్రెల పంపిణీ పథకంలో మనీలాండరింగ్! రంగంలోకి ఈడీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ సందర్భంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని బుధవారం రాష్ట్ర పశుసంవర్థక శాఖకు ఈడీ జోనల్‌ ఆఫీసు నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

రూ. 700 కోట్లు అవినీతి..

కాగా, తెలంగాణలో గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల స్కామ్‌ జరిగిందని ఏసీబీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించనుంది. గొర్రెల పంపిణీలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఈడీ శాఖను కోరింది. మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందన్న ఏసీబీ అధికారులు కేసులో పది మంది నిందితులను గుర్తించారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వారిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed