- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి తలసాని ప్రోటోకాల్ పాటించరు.. మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక
దిశ, వెబ్ డెస్క్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోటోకాల్ పాటించరని మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆరోపించారు. దిశ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి తదితర విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వన్ మ్యాన్ షో చేస్తారని, తన డివిజన్ లో అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఏమాత్రం ప్రోటోకాల్ పాటించరని అన్నారు. స్థానిక కార్పొరేటర్ గా ఉన్న తనను ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. ప్రజలకు సంబంధించిన పనులపై ఆయనకు పట్టింపు ఉండదని అన్నారు.
తాను బీజేపీకి చెందిన కార్పొరేటర్ ను కాబట్టే తనను ఆహ్వానించడం లేదని.. అదే బీఆర్ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్లను కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారని చెప్పారు. మంత్రి అపాయింట్ మెంట్ కోసం పబ్లిక్ టాయ్ లెట్స్ ను లాక్ చేసి పెట్టాల్సి వచ్చిందని అన్నారు. వాళ్లే పనులు ఆపుతారు.. మళ్లీ ప్రజల ముందు ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నట్లు నటిస్తారని అన్నారు. హడావుడిగా పనులు ప్రారంభిస్తారని, ఆ తర్వాత పట్టించుకోరని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పని చూస్తే ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటుందని చెప్పారు. ఇంకా ఎన్నో విషయాలు ఆమె దిశ టీవీతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడండి.