- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో నిరుద్యోగ నిర్మూలనకు మోడీ సర్కార్ కృషి: కేంద్రమంత్రి G. Kishan Reddy
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ పేదరిక, సమస్యను నిర్మూలన కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తిరంగా ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బర్కత్‌పుర బీజేపీ సిటీ ఆఫీస్ నుంచి నారాయణ గూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ఆజాధి కా అమృత్ మహోత్సవ" కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము చేపట్టిందన్నారు.
స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని, దేశంలో ప్రతి ఒక్కరు 76వ స్వాతంత్ర వేడుకలలో భాగ్యసాములు కావాలని, ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్ సైకిల్‌లతో ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల జిల్లా కేంద్రాలలో 75 మొక్కలు నాటాలని, ఈ సందర్భంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని అమృత వనంగా పేరు పెట్టడం జరిగిందన్నారు. ప్రపంచంలో భారత్ విశ్వ గురువు స్థానంలో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి.. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం, ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు.