బండికి.. మోడీ, రేవంత్ స్పెషల్ బర్త్ డే విషెస్

by Rajesh |
బండికి.. మోడీ, రేవంత్ స్పెషల్ బర్త్ డే విషెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ విషెస్‌ను లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ లోని బండి సంజయ్ నివాసానికి పూలబొకే, బర్త్ డే గ్రీటింగ్స్ పంపించి మరీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు బండికి విషెస్ చెప్పారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా పార్లమెంట్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ డేనియల్ ములినో.., సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా సంజయ్ ఆస్ట్రేలియాలో పర్యటించాలని ఆహ్వానించారు. డేనియల్‌తో పాటు ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ వడ్లకొండ, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సాయిని రాజ్ కుమార్ సంజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed