- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.9200 కోట్లు ఎటూ సరిపోవు.. సర్కార్ పునరాలోచన చేయాలని తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల బడ్జెట్ మరింత పెంచాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శనివారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీలకు రూ.9200 మాత్రమే పెట్టారని, ఇవి ఎటూ సరిపోవన్నారు. జనాభా సంఖ్యాపరంగా బీసీలకు 50 శాతం బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. విద్యాశాఖ పరిస్థితీ అంతే అన్నారు. ఈ బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టారని, ఇవి టీచర్ల జీతాలకే సరిపోతాయన్నారు. సర్కార్ పునరాలోచన చేయాలని కోరారు. ఇక, దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టం అమలవుతుందని, తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయాలని కోరారు.
విద్యావ్యవస్థలో కొత్త మార్పులు తీసుకురావాలన్నారు. 2011 లెక్కల ప్రకారం మన స్టేట్‌లో 14–18 ఏళ్ల వయస్సుల్లో 21 శాతం, 17–18 వయస్సులో 40 శాతం డ్రాప్ అవుట్‌లు ఉన్నారన్నారు. ఈ పరిస్థితిని ఛేంజ్ చేయాలన్నారు. విద్యావ్యవస్థలో దారుణంగా వెనకబడ్డామన్నారు. మరోవైపు కొత్త స్కూళ్ల కంటే ఉన్న వాటిని మరింత పటిష్టం చేయాలన్నారు. మరోవైపు గత సర్కార్ ఛాన్స్ దొరికిన ప్రతీ చోట అవినీతికి పాల్పడిందన్నారు. అడ్డగోలు దోపికి తెరలేపిందన్నారు. అర్హులందరికీ రుణమాఫీ పూర్తయ్యేలా సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.