- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLC Kavitha : రెజ్లర్ల పోరాటంపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రెజ్లర్ల పోరాటానికి కవిత మద్దతుగా నిలిచారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ‘మన మహిళా రెజ్లర్ల కృషి, అంకితభావం, దేశభక్తి భారతదేశం ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. భారత ప్రభుత్వం ఈ 5 రోజుల్లో దేశ ప్రయోజనాల గురించి ఆలోచించాలి.
పోక్సో వంటి తీవ్రమైన అభియోగాలు మోపిన తర్వాత కూడా నిందితుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. బాధితురాలికి న్యాయం జరగాలి. బంగారు పతకాన్ని ప్రధానం చేసిన మహిళా క్రీడాకారిణిలపై క్రూరత్వ చర్యలు ఖచ్చితంగా ఖండించదగినది. దేశం మొత్తం సమాధానం కోరుకుంటోందని, ప్రపంచం చూస్తోందని ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పటికైనా చర్య తీసుకోండి’ అంటూ కవిత ట్వీట్ చేశారు.
Read More... BRS : బీఆర్ఎస్‌లో వర్గ పోరు