- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర ఎన్నికల సంఘానికి MLC కవిత ప్రత్యేక విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విచారణ ముగిసిన అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ అరెస్ట్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘమే కాపాడాలని కోరారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయగా రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. తాజాగా ఆ గడువు నేటితో ముగిసిపోయింది. ఈ క్రమంలో.. ఆమెను మళ్లీ కోర్టు ఎదుట హాజరు పరిచారు ఈడీ అధికారులు. దీంతో కవితకు మరో మూడు రోజుల కస్టడీ కోర్టు అనుమతించింది. మరోవైపు హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు శనివారం ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. మాదాపూర్‌లోని కవిత భర్త అనిల్ సోదరి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.