- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha: ఇది ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం.. సారంగపూర్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత
దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో (SARANGPUR KGBV) ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ఈ ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఓ చోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుండటం విద్యార్థుల క్షేమం పట్ల తల్లిదండ్రుల భయాందోళన నెలకొందని అన్నారు. విద్యార్థులకు కనీసం నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనంగా మారిందని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదని ధ్వజత్తారు. సీఎం తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించి వాటి పరిస్థితులపై సమీక్ష చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.