ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి

by GSrikanth |   ( Updated:2024-03-16 05:10:45.0  )
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాదాద్‌లోని ఆమె నివాసంలో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కవితను ఢిల్లీకి తరలించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు.. కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని, కేంద్రానికి నిరసన తగలాలని సూచించింది.

Advertisement

Next Story