MLC Kavitha: కవితకు ఇకనైనా బెయిల్ వచ్చేనా..! నేడు పిటిషన్‌‌పై సుప్రీం కోర్టులో విచారణ

by Shiva |   ( Updated:2024-08-12 05:33:05.0  )
MLC Kavitha: కవితకు ఇకనైనా బెయిల్ వచ్చేనా..! నేడు పిటిషన్‌‌పై సుప్రీం కోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ, సీబీఐ దాఖలు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. కవిత సీబీఐ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఆ రెండు కోర్టులు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా, ఇటీవలే ఇదే కేసులో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. అదే ఆశతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మిన కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా.. లేక రిమాండ్‌ను పొడిగిస్తుందా అనే విషయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏదో తెలియని టెన్షన్ నెలకొంది. కాగా, కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా.. జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా అప్పటి నుంచి ఆమె తీహార్ జెల్లోనే ఉంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed