- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha :రేపు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో కానీ, ఢిల్లీలో కానీ విచారణకు హాజరు కావాలని కవితను సీబీఐ ఆదేశించింది. ఇచ్చిన నోటీసుల ప్రకారం 6వ తేదీన ఆమెను విచారించేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు రాగా.. ముందే ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల కారణంగా ఆమె హాజరుకాలేకపోతున్నానని తెలిపింది. విచారణకు వచ్చే అధికారులు 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా రావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీని విచారించేందుకు రేపు మరోసారి హైదరాబాద్‌కు రానున్నారు. మరోపక్క.. సీబీఐ విచారణ విషయంలో ఎమ్మెల్సీ కవిత అనుసరిస్తున్న తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. సీబీఐ అధికారుల విచారణను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.