- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు MLC కవిత
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం అక్కడే ఆమెను అరెస్టు చేశారు. రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకుని మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేసినట్లు జైలు అధికారులకు రాతపూర్వకంగా తెలియజేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, ఐపీసీలోని 120-బి, 477 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఆమెను రౌస్ అవెన్యూ (సీబీఐ స్పెషల్) కోర్టులో హాజరుపర్చనున్నారు.
లిక్కర్ కుంభకోణం కేసులో ప్రశ్నించేందుకు కోర్టును సీబీఐ అనుమతి కోరనుంది. ఇదిలా ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని ఆరోపిస్తూ కోర్టు జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశారు. రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించిన జడ్జి మనోజ్‌కుమార్... రెగ్యులర్ కోర్టులో శుక్రవారం ఉదయం అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. జైల్లోనే ఆమెను ఎంక్వయిరీ చేసిన తర్వాత అరెస్టు చేయడం కీలకంగా మారింది. ఆమె నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నది. కేసుకు సంబంధించి ఆమెను పది రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తున్నది.