ఢిల్లీలో ముగిసిన కవిత దీక్ష.. నిమ్మరసం ఇచ్చిన సీపీఐ నారాయణ

by GSrikanth |
ఢిల్లీలో ముగిసిన కవిత దీక్ష.. నిమ్మరసం ఇచ్చిన సీపీఐ నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత్ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన నిరాహార దీక్ష ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు, సీపీఐ నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తాము చేపట్టిన ఆందోళన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ సమస్య అన్నారు.

మోడీ ప్రభుత్వం తలచుకుంటే ఈ బిల్లు కచ్చితంగా పాస్ అవుతుందని ఆ ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోంస మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ బిల్లుపై ఓ మహిళగా రాష్ట్రపది ద్రౌపది ముర్ము కూడా దృష్టి సారించాలని తాము కూడా రాష్ట్రపతికి లేఖ రాస్తామన్నారు. దీక్షకు మద్దతు తెలిపిన పార్టీలకు ఈ సందర్భంగా కవిత ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story