- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవిత మరో సంచలన నిర్ణయం.. అక్కడే తేల్చుకోనుందా?
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమె నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు. ఇదిలా ఉండగా.. కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో కవితను వైద్య పరీక్షలు మగిశాయి. కవితను కస్టడీకి కోరడానికి ఈడీ అధికారులు.. సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని దేశ వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు.