తెలంగాణ ఏర్పడ్డాక క్రీడాకారులకు గౌరవం: TRS MLC Kalvakuntla Kavitha

by GSrikanth |   ( Updated:2023-01-05 07:40:10.0  )
తెలంగాణ ఏర్పడ్డాక క్రీడాకారులకు గౌరవం:  TRS MLC Kalvakuntla Kavitha
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో భుజం భుజం కలిపిన ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా అందరికీ తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని అభిప్రాయపడ్డారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకొని అభివృద్ధి వైపు వెళ్తున్నా మని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక క్రీడాకారులకు ఇచ్చిన గౌరవం గతంలో ఎప్పుడూ దక్కలేదని గుర్తుచేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.

Also Read....

కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌ పొత్తు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ

Advertisement

Next Story