MLC Kavitha: ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీష్‌రావు.. తిహార్ జైలులో కవితతో ములాఖత్

by Shiva |   ( Updated:2024-08-04 05:20:40.0  )
MLC Kavitha: ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీష్‌రావు.. తిహార్ జైలులో కవితతో ములాఖత్
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం కేటీఆర్, హరీష్‌రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. ఇప్పటిక చాలాసార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. బలమైన సాక్షాధారాలను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆమెకు బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. కాగా, ఇటీవలే ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ల‌పై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed