తెలంగాణ మహిళలకు MLC కవిత కీలక పిలుపు

by GSrikanth |   ( Updated:2024-03-08 06:58:52.0  )
తెలంగాణ మహిళలకు MLC కవిత కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం తెలంగాణ ఆడ బిడ్డలకు మహిళ దినోత్సవం సందర్భంగా కవిత శుభాకాంక్షలు చెప్పారు. మహిళ లేనిదే గమ్యం, గమనం లేదని అన్నారు. మనకంటే ముందు తరం వారు మన అక్క, చెల్లెలు మన కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసింది, రాణి రుద్రమ పోరాటం మనకు స్ఫూర్తిదాయకం, తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం మనం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story