కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ ఒక బూటకం.. ఆ రెండు పార్టీలకు అభ్యర్థులే లేరు: కవిత ఫైర్

by Satheesh |   ( Updated:2023-08-28 07:39:38.0  )
కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ ఒక బూటకం.. ఆ రెండు పార్టీలకు అభ్యర్థులే లేరు: కవిత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ విడుదల చేసిన దళిత డిక్లరేషన్ ఒక బూటకమని ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. సోమవారం కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఎస్సీల మీద కాంగ్రెస్ ఎక్కడ లేదని ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీలను ఎన్నో సంవత్సరాలుగా పేదరికంలో ఉంచిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేస్తోన్న పనులనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతోందని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పింది చేయలేదని అన్నారు. ఇక, హంతకులే వచ్చి దండ వేసి కన్నీళ్లు కార్చినట్లు బీజేపీ వైఖరి ఉందని సెటైర్ వేశారు. రాష్ట్రంలో రైతుల మోటార్లకు బీజేపీ మీటర్లు పెట్టాలని కవిత చూస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే లేరని కవిత ఎద్దేవా చేశారు.

Also Read: కేసీఆర్ ఖేల్ ఖతం.. బీఆర్ఎస్ దుఖాన్ బంద్: కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

Next Story

Most Viewed