మాకేం అభ్యంతరం లేదు.. అమ్మ ఎలా ఉన్నా అమ్మే: MLC కవిత

by GSrikanth |
మాకేం అభ్యంతరం లేదు.. అమ్మ ఎలా ఉన్నా అమ్మే: MLC కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంలో తమకు ఎలాంటి అభ్యతరం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమ్మ పేదగా ఉన్నా.. గొప్పగా ఉన్నా అమ్మనే అన్నారు. శాసనమండలిలో గురువారం ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం సెక్రటేరియట్‌లో ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిచేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్నామన్నారు. కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జడ్చర్ల, అచ్చంపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో వేరశనగ రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారన్నారు. ఆ పంటకు క్వింటాలుకు రూ. 6377 కనీస మద్దతు ధర ఉండగా.. వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రూ. 5 వేలలోపు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వేరుశనగ పంటకే కాకుండా అన్ని పంటలకు కనీస మద్ధతు ధర కంటే తక్కువ ధర ఉంటే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కనీస మద్ధతు ధర కల్పిస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed