- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ వారికి ఏం సమాధానం చెబుతారు..? కేంద్రంపై MLC కవిత ప్రశ్నల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడంతో ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీ వ్యవహారంతో ప్రజల పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆమె ప్రశ్నించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని నిలదీశారు. హిండెన్ బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని గుర్తు చేశారు. అప్పుడే కేంద్రం జేపీసీ ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలని సూచించారు. జేపీసీని నియమించాలని కవిత డిమాండ్ చేశారు.