'మహిళలపై దాడి చేయడం మానుకోండి'.. బీజేపీకి ఎమ్మెల్సీ కవిత హితవు

by Vinod kumar |   ( Updated:2023-08-24 14:34:58.0  )
మహిళలపై దాడి చేయడం మానుకోండి.. బీజేపీకి ఎమ్మెల్సీ కవిత హితవు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలపై దాడి చేయడం మానుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీకి సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీజేపీ చేసిన ట్వీట్‌పై గురువారం ఘాటుగా స్పందించారు. కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలలో అవహేళన చేయడం తగదని స్పష్టం చేశారు.

మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేక పోతుందా అని ప్రశ్నించారు. మహిళ హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story