ఇంతకాలం కేటీఆర్ ఏం పీకాడు.. మాజీ మంత్రిపై అశోక్ సర్ ఫైర్ (వీడియో)

by Nagaya |
ఇంతకాలం కేటీఆర్ ఏం పీకాడు.. మాజీ మంత్రిపై అశోక్ సర్ ఫైర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రముఖ ‘అశోక అకాడమీ’ చైర్మన్ అశోక్ సర్ ఉన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడే అశోక్ సర్ పోటీలో ఉండటం ఈ ఎన్నికలు ప్రత్యేకంగా నిరుద్యోగులకు ఒక ఆయుధంగా మారబోతున్నాయి. గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అసలు రాజకీయాలకు సంబంధం లేదని విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు రాజకీయనేతలకు తెలియవని, ఇలాంటి సమయంలో అశోక్ సర్ ఎన్నికల బరిలో నిలవడం నిరుద్యోగుల విజయమే అంటున్నారు. నిరుద్యోగులకు ఎదురైన ఎన్నో సమస్యలపై అశోక్ సర్ ఉద్యమాలు చేసి పోరాడారని యువత చెప్పుకొస్తున్నారు. ఒక అధ్యాపకుడిగా ఉన్న అశోక్ సర్ నిరుద్యోగుల పక్షాన పోటీ చేయడానికి కారణాలేంటి, ఇప్పుడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి? వాటిని ఎలా పరిష్కరించాలో చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాలని, గతంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా చెప్పిన అశోక్ సర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...

Advertisement

Next Story

Most Viewed