Balmuri Venkat: కౌశిక్ రెడ్డి ఓ సూసైడ్ స్టార్

by Gantepaka Srikanth |
Balmuri Venkat: కౌశిక్ రెడ్డి ఓ సూసైడ్ స్టార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ఓ సూసైడ్ స్టార్ అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కౌశిక్‌(Kaushik Reddy)ను ఆంబోతులా రోడ్లపైకి వదిలేసిందన్నారు. అందుకే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసినప్పుడు కౌశిక్ కోవర్ట్ లాగా వర్క్ చేశాడన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామన్నారు. హుజురాబాద్‌లోని ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అడిగితే, అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఓ మహిళా అధికారిపై ఇష్టం వచిన్నట్లు మాట్లాడాడన్నారు. ఒక సర్పంచ్ కుటుంబంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 20 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆరోపించారు. ఆయన చరిత్ర మొత్తం మోసాల పుట్టనేనంటూ వివరించారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) కాళ్లు మొక్కి బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడేందుకు కౌశిక్‌కు సిగ్గు ఉండాలన్నారు.

Advertisement

Next Story