గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించండి

by GSrikanth |
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈసీని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈనెల 27న నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఆ రోజు వర్కింగ్ డే ఉన్నందున ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉండదన్నారు. దీని వలన ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉన్నదన్నారు. ఓటింగ్ శాతం పెరగాలంటే సెలవు ఇవ్వాలన్నారు. ఈ నిబంధన ఎప్పట్నుంచో ఉన్నదని, కానీ లాస్ట్ టైమ్ సండే రోజు పోలింగ్ జరగడం వలన ప్రత్యేకంగా సెలవు ఇవ్వాల్సిన అవసరం రాలేదని గుర్తుచేశారు.

Advertisement

Next Story