కేటీఆర్ సవాల్ స్వీకరించిన బల్మూరి వెంకట్.. మల్కాజ్‌గిరిలో పోటీకి సిద్ధమని ప్రకటన

by GSrikanth |
కేటీఆర్ సవాల్ స్వీకరించిన బల్మూరి వెంకట్.. మల్కాజ్‌గిరిలో పోటీకి సిద్ధమని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాల్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మల్కాజ్‌గిరి బరిలో నేను దిగుతా అని.. దమ్ముంటే కేటీఆర్ నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తా అని అన్నారు. మల్కాజ్‌గిరినే కాదు.. కేటీఆర్ కోరుకున్న నియోజకవర్గంలో తాను పోటీకి సిద్ధమని ఎమ్మెల్సీ వెంకట్ ప్రకటించారు.

కాగా, అంతకుముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి తాను రాజీనామా చేస్తాను. సీఎం ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేయాలి. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం. మీ సిట్టింగ్ సీటు మ‌ల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం.. సేఫ్ గేమ్ వ‌ద్దు.. డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు. తాజాగా.. కేటీఆర్ విసిరిన ఈ సవాల్‌కు బల్మూరి వెంకట్ స్పందించి, కేటీఆర్‌కు ప్రతి సవాల్ విసిరారు.

Advertisement

Next Story