చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా అమలు చేస్తాం: బల్మూరి వెంకట్

by GSrikanth |
చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా అమలు చేస్తాం: బల్మూరి వెంకట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమది కాలం వెళ్లదీసే ప్రభుత్వం కాదని చెప్పారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. కేవలం ఇచ్చిన గ్యారంటీలే కాదని.. మరికొన్ని ఇవ్వనివి కూడా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. ప్రజలు కూడా ఇక బీఆర్ఎస్‌ నేతల మాటలను పట్టించుకోనక్కర్లేదని తెలిపారు.

Advertisement

Next Story