- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హడలెత్తిస్తోన్న హైడ్రా.. అభినందనలు తెలుపుతూ CM కు ఎమ్మెల్యేలు లేఖ
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రాకు ప్రజల మద్దతు పెరుగుతుంది. హైడ్రాపై ఇబ్బందులు వస్తాయని తొలుత భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి తాజాగా ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. హైడ్రా వంటి వ్యవస్థ రాష్ట్రమంతలా విస్తరించాలంటూ ఎమ్మెల్యేల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు అందుతున్నాయి. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్షణ్ సీఎంకు లేఖ రాశారు. అలాగే సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్‌హౌస్ కట్టారని లేఖలో ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
హైడ్రాను తమ నియోజకవర్గంలోనూ విస్తరించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములను కాపాడాలంటూ వేముల వీరేశం లేఖలో పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురై భూములను కాపాడాలంటూ బీర్ల ఐలయ్య, తమ నియోజకవర్గంలో హైడ్రా వంటి వ్యవస్థ కోసం మానుకొండూర్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, కాలే యాదయ్య లేఖలో వ్రాసుకొస్తూ సీఎంను అభినందించారు.