MLA Sudhir Reddy: కాంగ్రెస్‌లోకి వెళ్లినోళ్లంతా టచ్‌లో ఉన్నారు

by Gantepaka Srikanth |
MLA Sudhir Reddy: కాంగ్రెస్‌లోకి వెళ్లినోళ్లంతా టచ్‌లో ఉన్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి(MLA Sudhir Reddy), కాలేరు వెంకటేష్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS) పార్టీ సంపూర్ణంగా త్వరలో పవర్‌లోకి వస్తుందన్నారు. ఇక మూసీ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి పోలీసులను పంపి ఇళ్లను ఖాళీ చేయించడం సరికాదని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ(Musi) ప్రక్షాళన పేరుతో బజారు భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళన స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. బీఆర్ ఎస్ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మూసీనది అభివృద్ధి పేరుతో నిర్వాసితులకు నష్టం జరగొద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.

నల్గొండ జిల్లా రైతులను కావాలనే రేవంత్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ హైదరాబాద్ నగరంలో 32 ఎస్టీపీలను నిర్మించగా, దాదాపు 8 ఎస్టీపీల నిర్మాణం పూర్తి అయిందన్నారు. మూసీ అభివృద్ధి చైర్మన్‌గా తాను కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత సీఎం టెండర్లు కాకుండాలక్షా 50 వేల కోట్లు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాల్సిన సీఎం, సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story