MLA Sanjay: గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు

by Gantepaka Srikanth |
MLA Sanjay: గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల కాంగ్రెస్ నేత గంగారెడ్డి(Gangareddy) హత్యతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) స్పష్టం చేశారు. కొందరు కావాలనే గంగారెడ్డి హత్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. బుధవారం ఈ అంశంపై ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడారు. గంగారెడ్డి హత్య బాధాకరమైన విషయం అని అన్నారు. అసలు ఏ కారణంగా హత్య జరిగిందో పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పారు. కొందరు ఆరోపించినట్లుగా గంగారెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు. తాము ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదన్నారు. హింస, హత్యలు ఎవరి ఇంట్లో జరిగాయో జగిత్యాల ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు అవకాశం రాకపోవడం వల్లే తాను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story